
మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా రూపొందించిన ‘హీరో’ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఇలా ముచ్చటించాడు. ‘‘అశోక్ కోసం రాసిన కథ కాదిది. హీరో అవుదామనుకునే ఓ కుర్రాడి కథ కాబట్టి కొత్తవాళ్లయితేనే యాప్ట్ అనుకున్నాను. లక్కీగా అశోక్‌తో కుదిరింది. హీరో అనే మాట కామన్‌గా అందరి లైఫ్స్‌లో ఇంజెక్ట్ అయిన పాయింట్. అందుకే ఈ టైటిల్ పెట్టాం. ఎవరూ టచ్ చేయని కొత్త స్టోరీలైన్‌తో సాగే అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్. అశోక్ ఒక కొత్త హీరోలా అనిపించకూడదని చాలా కేర్ తీసుకున్నాం. యాక్టింగ్ క్లాసెస్ లాంటివన్నీ నేను నమ్మను. అందుకే చిరంజీవి, మహేష్ బాబు లాంటి మన తెలుగు స్టార్స్ సినిమాలు వందల కొద్దీ చూసి, వాళ్లను అబ్జర్వ్ చేసి ఒక బాడీ లాంగ్వేజ్ పిక్ చేసుకోమని చెప్పాను. అతనిపై ఒకే జానర్ బ్రాండ్ పడకుండా సినిమాలో రకరకాల ఎమోషన్స్ ఉండేలా ప్లాన్ చేశాం. అయినా కూడా ఎక్కడా ఓవర్‌గా అనిపించకుండా పక్కింటి అబ్బాయిలాగే కనిపిస్తాడు. ఒక కొత్తబ్బాయి లాంచ్‌కి కావల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఈ కథలో ఉన్నాయి. గ్లామర్ రోల్స్‌లోనే ఎక్కువగా నటించిన నిధి అగర్వాల్, ఇందులో చాలా నేచురల్‌గా కనిపిస్తుంది. ఫిమేల్ క్యారెక్టర్‌తో వచ్చే ఎమోషనే మెయిన్ కాన్‌ఫ్లిక్ట్. కమర్షియల్ సినిమానే కానీ రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. కొత్తగా, ఎంగేజింగ్‌గా ఉంటుంది. ప్రయోగాలు చేసినా కమర్షియల్‌గానూ వర్కవుటయ్యేలా ఉండాలని నేను నమ్ముతాను.’’